
చెన్నైలోని తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో 25 లక్షల కార్లను తయారు చేశామని రెనాల్ట్ నిస్సాన్ ప్రకటించింది. గత 13 ఏళ్లలో ఏడాదికి సగటున 1.92 లక్షల కార్లను తయారు చేశామని పేర్కొంది. రెనాల్ట్, నిస్సాన్‌కు చెందిన మొత్తం 20 మోడల్స్‌ను ఈ ప్లాంట్‌లో తయారు చేశారు. కంపెనీ చెన్నై ప్లాంట్ 600 ఎకరాలలో విస్తరించి ఉంది. కేవలం ఇండియన్ మార్కెట్ కోసమే కాకుండా సుమారు 11.5 లక్షల కార్లను ఎక్స్‌పోర్ట్ కూడా చేసింది.