సిటీలో ‘రిన్యూఎక్స్​’ షురూ

సిటీలో ‘రిన్యూఎక్స్​’ షురూ

హైదరాబాద్​, వెలుగు: సోలార్​, విండ్​ పవర్​ వంటి రిన్యువబుల్​ ఎనర్జీల వాడకాన్ని మరింత పెంచడం, విషవాయువులను (కార్బన్​ ఎమిషన్స్) తగ్గించే టార్గెట్​తో హైదరాబాద్​లో శుక్రవారం ‘రిన్యూఎక్స్​ 2022’ ఆరో ఎడిషన్​ ఎగ్జిబిషన్​ మొదలైంది. రిన్యువబుల్​ ఎనర్జీకి సంబంధించి ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన ఈవెంట్లలో ఇదే అతిపెద్దది. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ‘పార్ట్​నర్​ స్టేట్​’గా వ్యవహరించింది. వారీ ఎనర్జీస్, గోల్డీ సోలార్, జింకో సోలార్, ప్రీమియర్ ఎనర్జీస్, జాక్సన్ గ్రూప్, రేజోన్ సోలార్, అదానీ సోలార్, ఎవర్‌‌‌‌వోల్ట్, ఎన్‌‌పాసిబిలిటీస్, రెడింగ్‌‌టన్, టచ్ ఎనర్జీ, డీఎన్​వీ, ఇంపల్స్ గ్రీన్, ఐకాన్ సోలార్, రేడియన్ ఇండస్ట్రీ, ఇన్‌‌వర్జీ, సన్‌‌బౌండ్ ఎనర్జీ తదితర కంపెనీలు తమ పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్  ఎక్విప్‌మెంట్స్, ఇన్వర్టర్లు, ఛార్జ్ కంట్రోలర్లు, బ్యాటరీలు, టెస్టింగ్  మానిటరింగ్ సిస్టమ్స్, కాంపోనెంట్లు, బయోఎనర్జీ పరికరాల తయారీదారులు, బ్యాక్ షీట్ తయారీదారులు  సిస్టమ్ ఇంటిగ్రేటర్లను ప్రదర్శిస్తున్నాయి.