పంచాయ‌‌‌‌‌‌‌‌తీ ఆఫీసర్ల అద్దె వెహికల్స్.. సేవలు పొడిగింపు

పంచాయ‌‌‌‌‌‌‌‌తీ ఆఫీసర్ల అద్దె వెహికల్స్.. సేవలు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: జిల్లా పంచాయ‌‌‌‌‌‌‌‌తీ అధికారులు(డీపీవో), డివిజన్ లెవేల్ పంచాయ‌‌‌‌‌‌‌‌తీ అధికారు(డీఎల్పీవో)లు వినియోగిస్తున్న అద్దె వాహనాల సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అద్దె వాహనాల ఫైల్‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 మంది జిల్లా పంచాయ‌‌‌‌‌‌‌‌తీ అధికారులు, 68 మంది డివిజన్ లెవేల్ పంచాయ‌‌‌‌‌‌‌‌తీ అధికారులకు వాహనాల సదుపాయం కొనసాగనున్నది.  వారి వాహన అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ. 3.96 కోట్లు మంజూరు చేసింది.