హైదరాబాద్​లో 25 శాతం పెరిగిన అద్దెలు

హైదరాబాద్​లో 25 శాతం పెరిగిన అద్దెలు

హైదరాబాద్ :  మనదేశంలో 2019 నుంచి ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఇండ్ల అద్దెలు  25 శాతం నుంచి 30 శాతం పెరిగాయి.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్దెలు 25 శాతం పెరిగాయి. హౌసింగ్​డాట్​కామ్​ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్​ ప్రకారం, 2019  ప్రీ-కరోనా లెవెల్​తో పోలిస్తే, ప్రధాన ఎనిమిది నగరాల్లో రెసిడెన్షియల్​ ప్రాపర్టీల సగటు నెలవారీ అద్దెలు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. 

సగటు నెలవారీ అద్దెలు 25 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగాయి. సేవారంగం బలంగా ఉన్న నగరాల్లోని కొన్ని కీలక ప్రాంతాలలో అద్దెలు 30 శాతానికి మించి పెరిగాయి.  హౌసింగ్​డాట్​కామ్  గ్రూప్ సీఈఓ ధృవ్  మాట్లాడుతూ,   పెద్ద నగరాల్లోని కొన్ని ప్రధాన స్థానాల్లో కిరాయిల పెరుగుదల విపరీతంగా ఉందన్నారు.