అచ్చం నాన్నలాగే.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

అచ్చం నాన్నలాగే.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

అకిరా నందన్(Akira Nandan).. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరంలేదు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడిగా అకిరా అందరికి సుపరిచితమే. దాంతో మెగా ఫ్యాన్స్ అతడిని మరో పవర్ స్టార్ లాగే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వారసుడి ఎంట్రీ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే సంక్రాంతి సందర్బంగా కనిపించిన అకిరా లుక్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటివరకు చిన్నపిల్లాడిలా కనిపించిన అకిరా.. గడ్డం, మీసంతో  అచ్చం పవన్ కళ్యాణ్ లాగే కనిపించి సోషల్ మీడియాను షేక్ చేశాడు. అచ్చం పవన్ కళ్యాణ్ లాగే కనిపించిన అకిరా ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఇక తాజాగా తల్లి రేణు దేశాయ్ అకిరా నందన్ కి సంబంధించిన ఫొటోలతో చేసిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అకిరాను చూస్తుంటే.. అచ్చం పవన్ కళ్యాణ్ లాగే కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటోలను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే అకిరా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఉండనుందనే న్యూస్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. సంగీతం కాదు అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. మరి ఈ విషయం పై అకిరా ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.