వరుణ్ పెళ్ళికి ఇన్విటేషన్ వచ్చింది కానీ.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వరుణ్ పెళ్ళికి ఇన్విటేషన్ వచ్చింది కానీ.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్(Varun tej)-లావణ్య(Lavanya tripathi) ల పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో ఘనంగా జరుగనుంది. ఈ వేడుక కోసం మెగా కుటుంబంతో పాటు అల్లువారి కుటుంబం ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. ఆయితే ఈ వేడుకకు చాలా తక్కువ మందికి ఇన్విటేషన్స్ వెళ్లాయని సమాచారం. కేవలం కుటుంబ సభ్యలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి తంతు జరుగనుంది. 

అయితే తాజాగా వరుణ్, లావణ్యపై పెళ్లిపై పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ పెళ్లి గురించి మాట్లాడుతూ.. వరుణ్ పెళ్ళికి నాకు కూడా ఆహ్వానం అందింది. కానీ.. నేను వెళ్లడం లేదు. నిహారిక పెళ్లికి కూడా నాకు ఆహ్వానం పంపారు.. నేను పోలేదు పిల్లల్ని పంపించాను. ఇక వరుణ్ తేజ్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. అతను ఎనిమిదేళ్ల వయస్సు నుంచి నాకు తెలుసు. నా కళ్ల ముందే పెరిగి పెద్దవాడయ్యాడు ఈ పెళ్లికి వెళ్లాలని నాకు లేదు కానీ.. నా బెస్ట్ విషెస్ మాత్రం వరుణ్‌కు ఎప్పుడూ ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.