సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, అప్పుడప్పుడు సినీ విషయాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే నటి రేణు దేశాయ్, తాజాగా ఒక సినిమా గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' చిత్రాన్ని ప్రశంసిస్తూ, ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రంగా అభివర్ణించారు.
రేణు దేశాయ్ ప్రశంసల జల్లు
రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, 'ధురంధర్' ఒక బ్రిలియంట్ మాస్టర్ పీస్ అని కొనియాడారు. ఇండియన్ ఆర్మీ, మన రక్షణ దళాలు (Armed Forces), ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మనల్ని క్షేమంగా ఉంచడానికి పగలు రాత్రి (24/7) ఎంత కష్టపడుతున్నారో ఈ సినిమా చూస్తే లోతుగా అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. మన స్వేచ్ఛకు వారే కారణమని, వారికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని తెలిపారు.
ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని రేణ దేశాయ్ ప్రశంసించింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. మీరు నిజంగా మీ దేశం గురించి పట్టించుకుంటే, మన సాయుధ దళాలు , ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మనల్ని సురక్షితంగా ఉంచడానికి 24/7 ఎలా పనిచేస్తున్నాయో గౌరవిస్తే, దయచేసి వెళ్లి ఈ సినిమా చూడండి. మనం 'సూడో పొలిటికల్లీ కరెక్ట్'గా ఉండటం మానేసి, మన భారత దేశం పక్షాన నిలబడాల్సిన, గర్వించదగిన హిందుస్తానీయులుగా ఉండాల్సిన సమయం ఇది. జై హింద్. భారత్ మాతా కీ జై" అని రేణు పోస్ట్ చేసింది.
ALSO READ : నా తండ్రిని చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. 20 ఏళ్ల సినీ కెరీర్‍పై ప్రియాంక ఎమోషనల్!
'సూడో సెక్యులర్స్'పై రేణు ఫైర్
ఈ పోస్ట్‌లో రేణు దేశాయ్ ముఖ్యంగా 'సూడో సెక్యులర్స్' (Pseudo-Seculars)గా వ్యవహరిస్తూ, దేశంపై మాట్లాడే హక్కు లేదని నిరూపించుకుంటూ తిరిగే వారు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని విమర్శించారు. కనీసం ఈ సినిమా చూసైనా దేశం పట్ల కొంత గౌరవం నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ మన దేశం పక్షాన నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్'
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. 'నాన్న' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ నిపుణుల సమాచారం ప్రకారం, 'ధురంధర్' ఇప్పటివరకు దాదాపు రూ. 148 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించింది.

