V6 News

Priyanka Chopra: నా తండ్రిని చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. 20 ఏళ్ల సినీ కెరీర్‍పై ప్రియాంక ఎమోషనల్!

Priyanka Chopra: నా తండ్రిని చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. 20 ఏళ్ల సినీ కెరీర్‍పై ప్రియాంక ఎమోషనల్!

తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్ లోనూ పరుస ప్రాజెక్ట్లు చేస్తూ ప్రపంచవ్యా ప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది స్టార్ నటి ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు చివరిసారిగా హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న 'వారణాసి' మూవీలో నటిస్తోంది . ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

అయితే ఇటీవల ఒక ఇంటర్వూలో  ప్రియాంక చోప్రా..  తన సినీ కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. 'నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి సినిమాలు సెలెక్టసుకోవాలో తెలియలేదు. వచ్చిన ప్రతి ప్రాజెక్టును ఒప్పుకున్న అసలు చాన్సులు రావడమే అదృష్టమని భావించాను. దీంతో ఎలాంటి క్యారెక్టర్ కు అయినా ఓకే చెప్పేదాన్ని. 20 ఏండ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న. ఇప్పుడు  నా త్యాగానికి అవతలి వైపు చూస్తున్నట్లు ఉంది. నేనెంత కష్టపడ్డానో మాత్రమే తెలుసు అని చెప్పింది.. 

ALSO READ :  'అఖండ 2: తాండవం' ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!

ఈ జర్నీలోనా బర్త్ డేస్ మిస్ అయ్యాను. ఆఖరికి నా తండ్రి హాస్పిటల్ లో ఉంటే ఆయన చివరి రోజుల్లోనూ నేను చూసుకోలేకపోయాను అంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయింది.  కనీసం పండగలు సెలబ్రేట్ చేసుకోలేదు. నా ఫ్యామిలీతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని గుర్తుచేసుకుంది.. ఇప్పుడు నాకు నచ్చిన స్క్రిప్ట్ కు మాత్రమే ఓకే చెబుతున్న 20-ఏండ్ల త్యాగం చేసి నేడు ఇలా ఉన్న' అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.