V6 News

Balakrishna : 'అఖండ 2: తాండవం' ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!

Balakrishna : 'అఖండ 2: తాండవం' ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అఖండ 2: తాండవం'  .  డిసెంబర్ 5 రిలీజ్ కావాల్సి ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది.  చివరికి సమస్యలను పూర్తి చేసుకుని డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించారు.  గురువారం11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతుందని వెల్లడించారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.  ఇప్పటికే ఈ మూవీ కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. 

చిన్న చిత్రాలపై 'అఖండ 2' ప్రభావం..

అయితే తొలుత డిసెంబర్12న థియేటర్లలోకి రావడానికి దాదాపు 10కి పైగా చిన్న సినిమాలు సిద్ధమయ్యాయి.  సినిమాల ప్రమోషన్స్ కూడా చేశారు. అంతా రెడీ అనుకున్న సమయాంలో సడెన్ గా అఖండ 2 తొలి డేట్ వాయిదా పడి డిసెంబర్ 12న విదుదలకు ఫిక్స్ అయింది. దీంతో ఈ చిన్న చిత్రాల రిలీజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.  అటు ఈ మేకర్స్ డైలమాలో పడ్డారు. థియేటర్ల కొరత రావడంతో పాటు పెద్ద సినిమాతో పోటీని తట్టుకోలేక కొన్ని సినిమాలు ఆ రోజు రిలీజ్ నుంచి వెనక్కి తగ్గాయి. మరో డేట్ ను ప్రకటించుకుంటున్నాయి. 

 

'మోగ్లీ', 'సైక్ సిద్ధార్థ్' రిలీజ్ వాయిదా 

ఇప్పటికే 'మోగ్లీ' పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ చిత్రంలో రాషన్ కనకాల, సాక్షి మధోల్కర్ ప్రధాన పాత్ర పోషించారు. భారీ అంచనాలతో వస్తున్న  తన సినిమా వాయిదా పడటంతో డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. లేటెస్ట్ గా 'అఖండ 2' కోసం 'సైక్ సిద్ధార్థ్' టీమ్ కూడా వెనక్కి తగ్గింది. ఈ మూవీలో నందు హీరో గా నటించారు. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన తమ సినిమాని జనవరి 1కి వాయిదా వేస్తున్నప్రకటించారు..  మరో వైపు 'ఈషా' మూవీ కూడా డిసెంబర్ 12న కాకుండా వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనిని డిసెంబర్19కి  పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ :  'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' షూటింగ్ షురూ.. వెంకీతో త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ!

 

'అఖండ2' కు పోటీగా  'అన్నగారు వస్తారు'

ఇక తమిళ స్టార్ హీరో కార్తి 'అన్నగారు వస్తారు' సినిమా మాత్రం అఖండ 2తో పాటు డిసెంబర్ 12న రిలీజ్ కానుంది.  బైలింగ్వల్ మూవీ కావడంతో పోస్ట్ పోస్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ఒకసారి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది.  ఈ నేపథ్యంలో  ఇది థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇది కూడా ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. అందుకే తమిళ్ వెర్షన్ మాత్రం రిలీజ్ ఖాయం అయింది. కానీ తెలుగు మూవీ కూడా విడుదలవుతుందా.. లేదా అనేది డౌట్ గా మారింది.

ALSO READ : సల్లం గుండాలే.. నువ్వు పైలంగా ఉండాలే.. ఆకట్టుకుంటున్న ఛాంపియన్ మూవీ వధువు పాట

అంతే కాకుండా' కామది డిజిటల్ సూత్రాస్',' ఘంటశాల', 'మిస్ టీరియస్' వంటి చిత్రాలు విడుదల కూడా వాయిదా పడే అకాశం ఉందని  తెలుస్తోంది. ఇన్ని చిన్న చిత్రాల విడుదల పై అఖండ2 ప్రభావం  గట్టిగానే పడింది.  వీటిల్లో ఎన్ని రిలీజ్ అవుతాయో ఎన్ని పోస్ట్ పోన్ అవుతాయో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.