V6 News

సల్లం గుండాలే.. నువ్వు పైలంగా ఉండాలే.. ఆకట్టుకుంటున్న ఛాంపియన్ మూవీ వధువు పాట

సల్లం గుండాలే.. నువ్వు పైలంగా ఉండాలే.. ఆకట్టుకుంటున్న ఛాంపియన్ మూవీ వధువు పాట

రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన చిత్రం ‘ఛాంపియన్’.  అశ్వనీదత్ సమర్పణలో  స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్  బ్యానర్స్‌‌‌‌పై  ప్రియాంక దత్   నిర్మించారు.  డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘సల్లం గుండాలే’ అంటూ సాగిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా, రితేష్ జి రావ్, మనీషా ఈరబత్తిని  కలిసి పాడారు. ‘సల్లం గుండాలే.. సల్లం గుండాలే.. పెండ్లి చేసుకుని నువ్వు పైలంగా ఉండాలే.. పిల్లా పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే.. నవ్వుతూ నువ్వుంటే నిన్ను ఇట్ట సూత్తాంటే కట్టాలల్లా, కన్నీళ్లల్లా ఎంతో సంబురం’ అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. 

 పెండ్లికి ముందు తన ఇల్లు,  గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో వధువు బాధపడుతుండగా, తన కుటుంబం, ఇరుగు పొరుగు ఆమెను ఓదార్చుతున్నట్టుగా సాగిందీ పాట. ప్రతి ఆడ పిల్లకు  కనెక్ట్ అయ్యేలా ఎమోషన్‌‌‌‌తో ఉన్న  ఈ పాట సినిమాపై ఆసక్తిని పెంచింది.   నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా కనిపించగా, రోషన్, అనస్వర రాజన్ జోడి డ్యాన్స్‌‌‌‌ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది.