V6 News

Venkatesh: 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' షూటింగ్ షురూ.. వెంకీతో త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ!

Venkatesh: 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47'  షూటింగ్ షురూ.. వెంకీతో త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ!

టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి.  గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకీతో కలిసి పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. వాటిలోని కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు దశాబ్దాలుగా కోరుకున్నారు. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది.

 'ఆదర్శ కుటుంబం' టైటిల్ తో.. 

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకుంటుంది. ఈ మూవీ వెంకటష్ కు 77వ చిత్రం ( Venky 77).  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కథాంశం కుటుంబ విలువలతో కూడిన భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన యాక్షన్‌ను మేళవిస్తుందని తెలుస్తోంది. షూటింగ్‌ను చకచకా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. టైటిల్, పోస్టర్ రెండూ కూడా మంచి హోమ్లీ ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి.

 త్రివిక్రమ్ 'ఆ' సెంటిమెంట్ రిపీట్

ఈ సినిమాతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన 'ఆ' సెంటిమెంట్‌ను కొనసాగించారని చెప్పొచ్చు. గతంలో ఆయన తీసిన 'అతడు', 'అత్తారింటికి దారేది', 'అ ఆ', 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ 'అ' లేదా 'ఆ' అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు వెంకీతో చేస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టడం కూడా ఆ సెంటిమెంట్ కొనసాగింపుగానే భావిస్తున్నాయి సినీ వర్గాలు.

►ALSO READ | Salman Khan: తెలంగాణలో సల్మాన్ ఖాన్ భారీ పెట్టుబడులు.. రూ. 10 వేల కోట్లతో మెగా టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు!

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక ,  హాసిని క్రియేషన్స్  నిర్మిస్తోంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా ఇటీవల 'యానిమల్' చిత్రంతో సంచలనం సృష్టించిన హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు పరిశీలనలో ఉంది.  సినీ పరిశ్రమలో వెంకటేష్ కు ఉన్న నిలకడైన అప్పీల్‌ను, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు.