IPL 2026: నన్ను రిలీజ్ చేసి వేలంలోకి పంపండి.. రాజస్థాన్‌కు సంజు శాంసన్ గుడ్ బై

IPL 2026: నన్ను రిలీజ్ చేసి వేలంలోకి పంపండి.. రాజస్థాన్‌కు సంజు శాంసన్ గుడ్ బై

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ శాంసన్ ను జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిపి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాడు. ఆ తర్వాత సంజు రాజస్థాన్ జట్టులోనే 2026 ఐపీఎల్ సీజన్ వరకు ఉంటాడనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పుడు సంజు శాంసన్ విషయంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వేలంలోకి వెళ్లనున్నట్టు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.    

సంజు చెన్నై జట్టులో చేరడం సంగతి పక్కన పెడితే అతను రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో ఉండడానికి ఆసక్తి చూపించినట్టు సమాచారం. రాజస్థాన్ ఫ్రాంచైజీని విడుదల చేయాలని అధికారికంగా రిక్వెస్ట్ చేసినట్టు క్రిక్‌బజ్‌ కన్ఫర్మ్ చేసింది. గురువారం (ఆగస్టు 7) క్రిక్‌బజ్‌లో  నివేదిక ప్రకారం, సామ్సన్, రాజస్థాన్ రాయల్స్ కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని.. తనని వేలంలోకి పంపాల్సిందిగా సంజు కోరినట్టు తెలుస్తోంది. సామ్సన్ ఇకపై రాయల్స్‌తో కొనసాగాలని కోరుకోవడం లేదని అతని కుటుంబ సభ్యులు బహిరంగంగా చెబుతున్నారు.  

ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు శాంసన్ అత్యధిక మ్యాచ్ (149) లు ఆడాడు. అంతేకాదు ఈ ఫ్రాంచైజీ తరపున 4027 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో 2021 సీజన్‌కు ముందు సామ్సన్ రాజస్థాన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.  గత నాలుగు సీజన్ లలో శాంసన్ మొత్తం 67 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసి 33 విజయాలను అందించాడు. 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘోరంగా ఆడింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో 9వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో ఓవరాల్ గా తొమ్మిది మ్యాచ్‌ల్లో 35.62 సగటు.. 140.39 స్ట్రైక్ రేట్‌తో శాంసన్ 285 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో శాంసన్  కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.

శాంసన్ పై మాకు ఆసక్తి ఉంది:
  
"మేము సంజు శాంసన్ ను ఖచ్చితంగా మా జట్టులో పరిగణిస్తాము. అతను ఒక ఇండియన్ బ్యాటర్.. వికెట్ కీపర్ కూడా. అదే విధంగా ఇన్నింగ్స్ ను కూడా ఓపెన్ చేయగలడు. అతను మాకు అందుబాటులో ఉంటే, ఖచ్చితంగా మా స్క్వాడ్ లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మేము ఇంకా ట్రేడ్ ఆప్షన్స్ ను ఇంకా నిర్ధారించుకోలేదు. కానీ అతడిని మా జట్టులో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. రాజస్థాన్ రాయల్స్‌తో మేము ఇంకా అధికారికంగా ఏమీ మాట్లాడలేదు". అని సూపర్ కింగ్స్ అధికారి ఒకరు అన్నారు.