మరికొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్.. రోహిత్ శర్మకు గాయం!

మరికొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్.. రోహిత్ శర్మకు గాయం!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్‌ సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఓవల్ వేదికగా బుధవారం నుండి  భార‌త్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది సమరం మొదలుకానుంది. ఈ సమయంలో భారత అభిమానులకు చేదువార్త అందుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయడ్డాడు. హిట్ మ్యాన్ బొటన వేలికి దెబ్బ తగిలింది. దీంతో అతడు బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది అనుమానంగా మారింది. 

మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ అనూహ్యంగా గాయపడ్డాడు. ఓ బంతి బౌన్స్ అయ్యి అతని బొటన వేలిని తాకింది. వెంటనే ఫిజియో అప్రమత్తమై అతనికి బ్యాండేజ్ అందించాడు. అయితే బ్యాండేజ్ ధరించాక హిట్ మ్యాన్ ప్రాక్టీస్ కొనసాగించలేదు. ఫైనల్‌కు కొద్ది రోజుల ముందువరకూ కుడి చేతికి బ్యాండేజ్ ధరించి కనిపించిన రోహిత్, ఇప్పుడు ఎడమ చేతికి బ్యాండేజ్ ధరించడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే మ్యాచ్ సమయానికి  రోహిత్ ఫిట్ గా ఉంటాడని టీమిండియా భావిస్తోంది. గత ఇంగ్లండ్ పర్యటనలో హిట్ మ్యాన్ అద్భుతంగా రాణించాడు. 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు.

https://twitter.com/mufaddal_vohra/status/1666026499030536192