చెత్త అంటే చెత్త బౌలర్లు.. పాకిస్తాన్ పరువు తీసిన రికీ పాంటింగ్!

చెత్త అంటే చెత్త బౌలర్లు.. పాకిస్తాన్ పరువు తీసిన రికీ పాంటింగ్!

ప్రపంచంలో తమ దేశమే గొప్ప.. తమదే సురక్షితమైన జీవితం అని చెప్పుకునే పాకిస్తాన్ ను బౌలర్లు ఒక లెక్క చెప్పండి. ఎటువంటి బ్యాటర్లనైనా దడదడలాడించే పేసర్లు వారి జట్టులో ఉన్నారని ఎన్నిసార్లు చెప్పలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ముందు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తీరా వారందరూ విఫలమవడంతో ప్రస్తుతానికి ఆ మాటలను కట్టిపెట్టారు. ఇలా గాలి మాటలు మాట్లాడుతూ ప్రత్యర్థి జట్లను రెచ్చెగొట్టేలా వ్యవహరించే పాకిస్తాన్‌కు ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ తగిన బుద్ధి చెప్పారు. 

డిసెంబర్ 10 నుంచి కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య  మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ  టూర్ నుంచి పాకిస్తాన్ ప్రధాన పేసర్ హారిస్ రౌఫ్ తప్పుకోగా.. షాహీన్ అఫ్రిది, అమీర్ జమాల్, ఫాహిమ్ అష్రఫ్, హసన్ అలీ, ఖుర్రం షెహజాద్, మహమ్మద్ వాసిమ్ జూనియర్ వంటి పసలేని బౌలర్లను పీసీబీ ఎంపిక చేసింది. ఈ  బౌలింగ్ లైనప్‌పై పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో షాహీన్ అఫ్రిది మినహా మిగిలిన బౌలర్లలో ఎవరికీ ఆసీస్ బ్యాటర్లను ఎదుర్కొనే నైపుణ్యం లేదని తేల్చి చెప్పారు. 

"పాకిస్థాన్ జట్టు గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన సమయంలో నేను జర్నలిస్టులతో ఒక మాట అన్నాను. అదేంటంటే.. ? అత్యంత చెత్త బౌలర్లతో పాక్ మా దేశానికి వచ్చిందని. ఆ మాటలను అన్నందుకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా.. ఇప్పుడు మనతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు రాబోయే పాక్ బౌలింగ్ టీమ్ అప్పటి కంటే మరింత అధ్వాన్నంగా ఉంది.." అని పాంటింగ్ పాక్ బౌలర్ల పరువు తీసేలా మాట్లాడినట్లు ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫాహిమ్ అష్రఫ్, హసన్ అలీ ఉన్నారు , ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ రిజ్వాన్, నౌమాన్ అలీ, మొహమ్మద్ వాసిమ్ జూనియర్, సయ్యద్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ మరియు షాహీన్ షా అఫ్రిది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • మొదటి టెస్ట్ (డిసెంబర్ 14 - డిసెంబర్ 18): పెర్త్ స్టేడియం
  • రెండో టెస్ట్: (డిసెంబర్ 26 - డిసెంబర్ 30): మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్
  • మూడో టెస్ట్ (జనవరి 3 - జనవరి 7): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్