తర్వాత తగ్గేది పెట్రోల్ రేట్లేనా.. లీటర్ 5 రూపాయలు తగ్గనుందా..?

తర్వాత తగ్గేది పెట్రోల్ రేట్లేనా.. లీటర్ 5 రూపాయలు తగ్గనుందా..?

ఇంట్లో ఉపయోగించే 14 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను భారీ తగ్గించింది కేంద్రం. సిలిండర్పై ఏకంగా 200 రూపాయల రాయితీ ఇచ్చింది. అదే విధంగా ఉజ్వల్ స్కీం కింద ఏకంగా 400 రూపాయల రాయితీ ఇచ్చింది. తొమ్మిదేళ్లుగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలకు బ్రేక్ వేయటమే కాకుండా.. ఏకంగా భారీ మొత్తంలో ఒకేసారి తగ్గించటం ఇదే తొలిసారి.

Also Read :- క్రికెటర్‌‌ను వదలని రేప్ కేసు.. బాధితురాలు ఆత్మహత్యాయత్నం

 ఈ సమయంలో మరో వార్త సైతం చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గిస్తారనే ప్రచారం మరింత ఊపందుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 5 రూపాయల వరకు తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి కారణం లేకపోలేదు. 2023, జూన్ నెలలోనే ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. ఇంధన ధరలను తగ్గించటానికి అవకాశం ఉందీ ఉంది. ఇప్పుడు గ్యాస్ ధరలను తగ్గించటంతో.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు అంశం తెరపైకి వచ్చింది.