Virat Kohli: రూ. 110 కోట్ల డీల్‌.. ప్యూమాతో కోహ్లీ కాంట్రాక్ట్ రద్దు

Virat Kohli: రూ. 110 కోట్ల డీల్‌.. ప్యూమాతో కోహ్లీ కాంట్రాక్ట్ రద్దు

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్యూమాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాడు. విరాట్ మున్ముందు ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ స్థాపించిన అజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకున్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ప్యూమాను వీడినట్లు తెలుస్తోంది. 

2017లో కోహ్లీ.. ఎనిమిదేళ్ల కాలానికి ప్యూమాతో రూ. 110 కోట్ల  ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ముగియనుంది. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ బిల్‌బోర్డ్‌లు, టెలివిజన్ స్క్రీన్‌లు మరియు వివిధ సోషల్ మీడియా వీడియోల్లో కనిపించారు.