- పీఆర్సీ రిపోర్టును తెప్పించి.. ఫిట్‌మెంట్ ప్రకటించాలి
- టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించేలా రేషనలైజేషన్ జీవో 25ను ప్రభుత్వం వెంటనే సవరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
ఈ మీటింగ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. ప్రైమరీ స్కూళ్లలో 60 మంది పిల్లలకు ఇద్దరే టీచర్లు ఉండాలనే నిబంధన సరికాదన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతం కావాలంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా క్లాస్‌కో టీచర్‌ని ఇవ్వాలని కోరారు. టీచర్లను తరగతి గదికి, బోధనకు దూరం చేసేలా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కార్యక్రమాలు, లెక్కలేనన్ని యాప్‌లు, ఇబ్బడిముబ్బడిగా పెట్టిన శిక్షణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ కమిటీ రిపోర్టును ప్రభుత్వం వెంటనే తెప్పించుకొని బహిర్గతం చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలు చేయాలని నేతలు కోరారు. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర నేతలు పి. నాగిరెడ్డి, జి. తిరుపతి రెడ్డి, ముత్యాల రవీందర్, పి. నారాయణమ్మ, ఎం. లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
