
గోదావరిఖని, వెలుగు : రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సికింద్రాబాద్ డివిజన్ రైల్వే డీఆర్‌యూసీసీ మెంబర్ అనుమాస శ్రీనివాస్(జీన్స్) గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. బల్హార్ష నుంచి కాజీపేట వరకు నడిచే అజ్నీ ట్రైన్‌ను సికింద్రాబాద్ వరకు పొడిగించాలని, రామగుండం రైల్వే స్టేషన్ ద్వారా సికింద్రాబాద్‌కు ఉదయం 4.20 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం తొందరగా చేపట్టాలని, ఈ అంశాలను రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.