
- మూడు డెడ్ బాడీలు స్వాధీనం.. అందులో ఒకటి ఇండియన్ది
ఖాట్మండు: నేపాల్ త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతైన 54 మంది ప్యాసింజర్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. శనివారం ఉదయం భారత్‌కు చెందిన రిషి పాల్ షాహి(40) డెడ్ బాడీ దొరికింది. ప్రమాదం జరిగిన స్థలానికి దాదాపు 50 కి.మీ. దూరంలో బురదలతో రిషి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం మరో రెండు మృతదేహాలను గుర్తించామని వివరించారు. నేపాల్ పౌరులతోపాటు భారత్‌కు చెందిన మరో ఆరుగురి( సంతోష్ ఠాకూర్, సురేంద్ర సా, అదిత్ మియాన్, సునీల్, షానవాజ్ ఆలం, అన్సారీ) ఆచూకీ తెలియాల్సి ఉందని..వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 500 మందికి పైగా నేపాలీ ఆర్మీ, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారని తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కోసం వాటర్ డ్రోన్‌లు, సోనార్
కెమెరాలను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.