కలిసొచ్చిన రిజర్వేషన్..తల్లి సర్పంచ్ గా, కొడుకువార్డ్ మెంబర్గా ఏకగ్రీవమే..

కలిసొచ్చిన రిజర్వేషన్..తల్లి సర్పంచ్ గా, కొడుకువార్డ్ మెంబర్గా ఏకగ్రీవమే..

చింతకాని, వెలుగు: స్థానిక సంస్థల రిజర్వేషన్  ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి కలిసివచ్చింది. గ్రామ సర్పంచ్  స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్  అయింది. గ్రామంలో 470 ఓటర్లు ఉన్నాయి. అయితే రాఘవాపురంలో ఎస్సీ మహిళ కాంపల్లి కోటమ్మ ఫ్యామిలీ మాత్రమే ఉంది. కాంపల్లి కోటమ్మ సర్పంచ్ గా ఏకగ్రీవం కానుంది.

 అలాగే నాలుగో వార్డ్  ఎస్సీ జనరల్ కు కేటాయించడంతో ఆమె కొడుకు దావీద్  కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో వార్డు కూడా ఎస్సీకి రిజర్వ్​ అయినప్పటికీ కోటమ్మ కూతురు వయసు ఏడాది తక్కువగా ఉండడంతో ఆ స్థానం ఏడాది పాటు ఖాళీగా ఉండనుంది. కోటమ్మ కూలీ పనులకు వెళ్తూ, గ్రామంలోనే ఒకరి ఇంటిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రిజర్వేషన్లు కలిసి రావడంతో గ్రామస్తులు కోటమ్మ ఫ్యామిలీని అభినందిస్తున్నారు. తల్లి సర్పంచ్ గా,  కొడుకు వార్డు మెంబర్ గా ఏకగ్రీవం అవుతున్నారని చర్చించుకుంటున్నారు.