దశలవారీగా ఐసీఆర్​ఆర్ ఉపసంహరణ.. ఆర్​బీఐ నిర్ణయం

దశలవారీగా ఐసీఆర్​ఆర్ ఉపసంహరణ.. ఆర్​బీఐ నిర్ణయం

ముంబై: మార్కెట్లోని మిగులు లిక్విడిటీని  తగ్గించేందుకు   ప్రవేశపెట్టిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ-సీఆర్‌‌ఆర్)ను శనివారం నుంచి దశలవారీగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం నిర్ణయించింది. ఈ ఏడాది మే 19 నుంచి జులై 28 మధ్య  ‘నెట్​ డిమాండ్​, టైమ్​ లయబిలిటీ (ఎన్​డీటీఎల్​) పెరుగుదలపై 10 శాతం  ఐసీఆర్​ఆర్​ను నిర్వహించాలని ఆగస్టులో బ్యాంకులను ఆర్​బీఐ ఆదేశించింది. 

రూ. 2,000 నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి ఇవ్వడంతో సహా వివిధ మార్గాల ద్వారా వచ్చిన మిగులు లిక్విడిటీని తీసుకోనుంది. ఐసీఆర్​ఆర్​ కింద సీజ్​ చేసిన మొత్తాలను దశలవారీగా విడుదల చేస్తారు. తద్వారా సిస్టమ్ లిక్విడిటీ ఆకస్మిక షాక్‌‌లకు గురికాకుండా మనీ మార్కెట్లు సక్రమంగా పనిచేస్తాయి. బ్యాంకులు నిర్వహిస్తున్న ఐసీఆర్​ఆర్​ మొత్తంలో 25 శాతంను శనివారం, మరో 25 శాతంను సెప్టెంబరు 23న విడుదల చేస్తామని.. మిగిలిన మొత్తాన్ని అక్టోబర్ 7న విడుదల చేస్తామని ఆర్‌‌బీఐ తెలిపింది.