V6 News

ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు : కాలనీవాసులు

 ఖానాపూర్ పట్టణంలోని  ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు : కాలనీవాసులు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం శ్రీరాంనగర్ కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, అక్రమంగా వేసిన షెడ్, టేలాను వెంటనే తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న స్థలాన్ని కాపాడి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. కాలనీవాసులు సతీశ్ రావ్, కిషన్, భీమన్న, దివాకర్, సంతోష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.