వీకెండ్ చిల్..లాంగ్ డ్రైవ్ కు ప్లాన్ చేస్తున్న సిటిజన్స్

వీకెండ్ చిల్..లాంగ్ డ్రైవ్ కు ప్లాన్ చేస్తున్న సిటిజన్స్

హైదరాబాద్, వెలుగు: వానాకాలం... ఎటు చూసినా పచ్చదనమే. ఈ సీజన్ వచ్చిందంటే సిటీజన్లు నచ్చిన ప్లేసెస్​కు టూర్ ప్లాన్ చేసుకుని వెళ్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చాలా రోజుల గ్యాప్ తర్వాత రిలాక్సేషన్ దొరకడంతో లాంగ్ రైడ్లతో సిటీ చుట్టుపక్కల ఉండే టూరిస్టు స్పాట్లకు వెళ్తున్నారు. వర్షాలకు వాటర్ ఫాల్స్, నేచర్ మరింత అందంగా మారుతుండటంతో అక్కడికి వెళ్లి రిలీఫ్ పొందుతున్నారు.  సిటీకి 60 నుంచి 100 .మీ   దూరంలో ఉన్న వాటర్ ఫాల్స్, పచ్చని ప్రదేశాలకు ట్రిప్​లు వేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్, వరంగల్, లక్నవరం, వైజాగ్, గోవా, కర్ణాటక, ఊటీ వంటి ప్లేసెస్​కు వీకెండ్​లో షార్ట్ 
ట్రిప్​లను    ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. 

సిటీకి దగ్గరలో అనంతగిరి హిల్స్

వీకెండ్​లో గ్రేటర్ సిటీ చుట్టూ 100 కి.మీ పరిధిలో ఉన్న టూరిస్ట్ స్పాట్లకు వెళ్లేందుకు సిటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  రెండు వారాల క్రితం వరుసగా కురిసిన వానలకు సిటీకి 60 కి.మీ దూరంలో వికారాబాద్ జిల్లా  అనంతగిరి హిల్స్ సమీపంలోని వాటర్ ఫాల్స్, రంగారెడ్డి జిల్లా మంచాలలోని బోడకొండ వాటర్ ఫాల్స్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులను చూసేందుకు జనం ఎక్కువగా వెళ్తున్నారు. మరికొందరు ఓన్​ వెహికల్స్​లో లాంగ్ ట్రిప్​లకు ప్లాన్ చేసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని  బోగత వాటర్ ఫాల్స్, లక్నవరం సరస్సు, నిర్మల్ జిల్లాలోని పొచ్చెర, శ్రీశైలం దగ్గరలోని మల్లెల తీర్థం, మహబూబాబాద్ జిల్లాలోని భీముని పాదం వాటర్ ఫాల్స్ ను చూసేందుకు వెళ్తున్నారు.  దీంతో పాటు గ్రీనరీ ఎక్కువగా ఉండే వైజాగ్​లోని అరకు, లంబసింగి, ఈస్ట్ గోదావరిలోని మారేడు మిల్లి, కర్ణాటకలోని చిక్ మంగుళూరు, హంపి, ఉడిపి, గోకర్నా, మురుదేశ్వర్, బడామి, నాగర్ హోల్ నేషనల్ పార్క్, కాబిని వంటి ప్రదేశాలకు  వెళ్తున్నారు. ఇటీవలె యునెస్కో గుర్తింపు పొందిన చరిత్రాత్మక గుడి రామప్పను చూసేందుకు సైతం సిటీ నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది.

ఫారెస్ట్ ఏరియాలో సైక్లింగ్..ట్రెక్కింగ్

ఓన్ వెహికల్స్​లో ఫారెస్ట్ ఏరియాలకు వెళ్లేందుకు మరికొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. సిటీ చుట్టుపక్కల ఉండే వికారాబాద్​తో పాటు శ్రీశైలం, నర్సాపూర్ ఫారెస్ట్, కర్ణాటక, మహారాష్ట్రలోని లోనావాలా ఏరియాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఫారెస్ట్ ఏరియాలకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కార్లలో వెళ్తూ నచ్చిన ప్రదేశం దగ్గర ఆగి రిలాక్స్ అవుతున్నారు. రెండ్రోజుల పాటు అక్కడే ఉండేలా  క్యాంప్​లను సెట్ చేసుకుంటున్నారు. ఫారెస్ట్ ఏరియాల్లో నేచర్ ను ఎంజాయ్ చేయడంతో  పాటు సైక్లింగ్, ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్ వంటివి ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ట్రైన్, ఫ్లైట్ లో కంటే రోడ్ రూట్​లో ట్రిప్స్​కి వెళ్లేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఓన్ వెహికల్ లేదా రెంటెడ్ కార్లలో వెళ్లడమే బెటర్​ అని సిటిజన్లు చెప్తున్నారు. 

రిలీఫ్​గా అనిపించింది 

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో చూసేందుకు ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్లా. అన్ లాక్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇలా లాంగ్ ట్రిప్ వెళ్లి రావడంతో కొంచెం రిలీఫ్​గా ​అనిపించింది. 
–తులసీదాస్, ప్రైవేటు ఎంప్లాయ్