
గంగాధర, వెలుగు: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి ఎస్సీ కాలనీవాసులు మంచినీటి కోసం సోషల్మీడియా వేదికగా కొన్నినెలలుగా ఉద్యమం చేస్తున్నారు. తాగునీటి కష్టాలపై ఎమ్మెల్యేకు సమాచారం చేరవేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి ఎస్సీ కాలనీ ప్రజలు పోస్టులు పెడుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన సమాచారం వాట్సాప్‌లో రెండు రోజులుగా వైరల్ అవుతోంది.