పరిహారం ఇవ్వకుండా.. పనులెట్ల స్టార్ట్‌‌‌‌ చేస్తరు

పరిహారం ఇవ్వకుండా.. పనులెట్ల స్టార్ట్‌‌‌‌ చేస్తరు
  • ధర్నాకు దిగిన వరంగల్‌‌‌‌ ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు నిర్వాసితులు
  • నాలుగేండ్ల కింద భూములు తీసుకుని పరిహారమివ్వని సర్కార్ 
  • పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్‌‌‌‌
  • మంత్రికి మాటివ్వడంతో హడావుడిగా ఏర్పాట్లు చేసిన లీడర్లు

వరంగల్, వెలుగు :  వరంగల్‌‌‌‌ ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు కోసం భూములు తీసుకొని పరిహారం ఇవ్వకుండా పనులెట్ల స్టార్ట్‌‌‌‌ చేస్తరు, శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్‌‌‌‌ను ఎట్ల పిలుస్తరు’ అంటూ నిర్వాసితులు రోడ్డెక్కారు. ఇందులో భాగంగా ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు కోసం కేటీఆర్‌‌‌‌ శంకుస్థాపన చేయనున్న ప్లేస్‌‌‌‌ వద్ద రెండు రోజులుగా దీక్షలు చేపట్టారు. తమకు పరిహారం పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని, లేదంటే మంత్రి పర్యటనను అడ్డకుంటామని హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు నిర్వాసితులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

పరిహారం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపులు

హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఖమ్మం మీదుగా వచ్చే వాహనాలు వరంగల్, హనుమకొండ సిటీలోకి రాకుండా ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు నిర్మించాలని ప్లాన్‌‌‌‌ చేశారు. ఇందులో భాగంగా 200 ఫీట్లతో ములుగు వెళ్లే దారిలోని ఆరేపల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నాయుడు పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వరకు రోడ్డు నిర్మించాల్సి ఉంది. నిధుల బాధ్యతను కుడాకు, రోడ్డు నిర్మాణ బాధ్యతను ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖకు అప్పగించారు. ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు కోసం మొత్తం89.36 ఎకరాలు అవసరం కాగా, 65 ఎకరాలను ప్రైవేట్‌‌‌‌ వ్యక్తుల నుంచి తీసుకోవాల్సి వచ్చింది. 

2010లో ప్లాన్‌‌‌‌ చేయగా భూసేకరణకు 2012లో ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. దీంతో భూ సేకరణకు ఆఫీసర్లు మార్కింగ్‌‌‌‌ చేసి, భూ సేకరణకు సంబంధించి 2019 మేలో ప్రకటన ఇచ్చారు. రైతుల ఇష్టంతో సంబంధం లేకుండా భూములు తీసుకున్న ఆఫీసర్లు వారికి పరిహారం ఇవ్వకుండానే భూముల చుట్టూ ఫెన్సింగ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. మొత్తం 360 మంది నుంచి భూమిని సేకరించిన ఆఫీసర్లు కొందరికి పరిహారం ఇచ్చి మరో 150 మందిని వదిలేశారు. దీంతో రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగినా ఆఫీసర్ల నుంచి స్పందన కరువైంది. 

మంత్రికి మాటిచ్చామనే పేరుతో ఏర్పాట్లు

గత నెల 5న వరంగల్‌‌‌‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌‌‌‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి ఇన్నర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు పనుల గురించి ఆరా తీశారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు, ఎమ్మెల్యే నరేందర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ పూర్తయిందని సమస్యలేమీ లేవని చెప్పారు. మరో నెలలో దామెర నుంచి నాయుడు పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ వరకు పనులు చేపడతామని మంత్రికి మాటిచ్చారు. దీంతో వీలైనంత త్వరగా పనులు స్టార్ట్‌‌‌‌ చేయాలని కేటీఆర్‌‌‌‌ ఆదేశించారు. మంత్రికి మాటిచ్చాం.. ఎలాగైనా పనులు స్టార్ట్‌‌‌‌ చేయాలన్న ఆలోచనతో 17న వరంగల్‌‌‌‌ – ఖమ్మం హైవేపై గల నాయుడు పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ వద్ద శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌‌‌‌ హాజరుకానున్నారు.

మూడ్రోజులుగా ఆందోళనలు

నాలుగేళ్లయినా పరిహారం ఇవ్వకపోవడం, 17న రింగ్‌‌‌‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 150 మంది నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా స్టార్ట్‌‌‌‌ చేస్తారంటూ శంకుస్థాపన చేయనున్న ప్లేస్‌‌‌‌ వద్ద మంగళవారం నుంచి ధర్నాకు దిగారు. పరిహారం ఇచ్చే వరకు పనులు చేయొద్దని పట్టుబట్టారు. దీంతో నిర్వాసితులకు నచ్చజెప్పే బాధ్యతను ఎమ్మెల్యే కలెక్టర్‌‌‌‌కు అప్పగించారు. గురువారం మధ్యాహ్నం సైతం ఆఫీసర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నిర్వాసితులు తమ పట్టు వీడలేదు. తమకు పరిహారం ఇచ్చాకే పనులు స్టార్ట్ చేయాలంటూ నిర్వాసితులు కలెక్టర్‌‌‌‌కు ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.

పనులను అడ్డుకుంటాం 

పరిహారం కోసం నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్నం. ఆఫీసులు, లీడర్ల చుట్టూ తిరిగి విసుగొచ్చింది. ఎప్పటికప్పుడు వెంటనే పైసలు పడుతాయని చెప్పిన్రు తప్ప పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు పనులకు శంకుస్థాపన చేస్తున్నాం అని ప్రకటించారు. మాకు న్యాయం జరగకుంటే మంత్రి పర్యటనను, పనులను అడ్డుకుంటాం.

గంగుల దయాకర్,  ఐఆర్ఆర్ బాధితుల సంఘం అధ్యక్షుడు