రెజోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ షురూ

రెజోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ షురూ

హైదరాబాద్​, వెలుగు: ఐఐటీ- జేఈఈ, నీట్ కోచింగ్ సేవలు అందించే రెజోనెన్స్ విద్యాసంస్థలు తిరుపతిలో తమ నూతన ఫౌండేషన్ సెంటర్‌‌ను ఘనంగా ఆరంభించాయి. మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 6–10 తరగతుల విద్యార్థుల కోసం వారానికి మూడు రోజులు ఆఫ్‌‌లైన్, ఆన్‌‌లైన్ విధానాల్లో ఈ ఫౌండేషన్ కోర్సులు అందిస్తారు. 

ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి ఆర్.కె. వర్మ 2001లో రాజస్థాన్‌‌లోని కోటాలో రెజోనెన్స్ సంస్థను స్థాపించారు. గడిచిన ఏడేళ్లలో తమ సంస్థ నుంచి 6,100 మందికి పైగా విద్యార్థులు ఐఐటీలు, నిట్లు, ఎయిమ్స్​లో సీట్లు సాధించారని ప్రకటించింది.