రిసార్ట్ నిర్వాహకులు రూల్స్ పాటించాలి .. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి

రిసార్ట్ నిర్వాహకులు రూల్స్ పాటించాలి .. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫామ్​హౌస్, రిసార్ట్​ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో ఫామ్​ హౌస్, రిసార్ట్ యజమానులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలు, ఫంక్షన్లకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. ఫామ్​హౌస్, రిసార్ట్  మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈవెంట్లు, పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, నందీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, మాడుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు.