జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై స్పందించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు

జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై స్పందించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశంపై 4 వారాల్లో స్పందనను తెలపాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ.. గతంలో కేంద్రం ఇచ్చిన హామీని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక -రాజకీయ కార్యకర్త అహ్మద్ మాలిక్ ల పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్‌‌లను ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌‌ తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత సంవత్సరం ఈ ప్రాంతంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. అయితే, ప్రస్తుతం నెలకొన్న భద్రతా సమస్యలు, ఇటీవలి పహల్గాం ఉగ్రదాడుల దృష్ట్యా రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వానికి మరింత సమయం అవసరమని ధర్మాసనానికి తెలిపారు.