చూసి తినండి : హైదరాబాద్లోని రెస్టారెంట్ చట్నీలో వెంట్రుకలు.. రూ. 5 వేలు ఫైన్

చూసి తినండి : హైదరాబాద్లోని రెస్టారెంట్ చట్నీలో వెంట్రుకలు.. రూ. 5 వేలు ఫైన్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి పలు రెస్టారెంట్ల నోటీసులు ఇస్తున్నా హోటల్స్ యాజమానుల పద్దతి మాత్ర మారడం లేదు. తినే ఫుడ్ ను సరిగ్గా ఒండకపోవడం.. మంచి పదార్థాలు వాడకపోవడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌లోని ఓ రెస్టారెంట్ లో చట్నీలో వెంట్రులకు రావడం కలకలం రేపింది. అది కూడా ఓ ప్రభుత్వ ఉన్నతాదికారికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

హైదరాబాద్‌లోని వినియోగదారుల హక్కుల కార్యకర్త ఉమేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి జూన్ 11, 2024న రెస్టారెంట్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే దోసె, ఆవిరి దోసె, ప్లేటు ఇడ్లీ ఆర్డర్ చేసి తింటున్నారు.  ఈ క్రమంలోనే ఆయన ఒక చట్నీలో వెంట్రుకులు రావడం గమనించారు. వెంటనే రెస్టారెంట్ మేనేజర్‌కి తెలియజేశారు. 

నష్టపరిహారం కొత్త ఫుడ్ ను అందించారు. దీనిపై ఆయన ఎక్స్ లో స్పందిస్తూ  ఇది అసహ్యకరమైన అనుభవం దానిని అంగీకరించిన హోటల్ మేనేజర్ ఆహారాన్ని కొత్త వంటకంతో భర్తీ చేశాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఏఎంఓహెచ్ కప్రా హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం హైదరాబాద్‌లోని రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించారు.