
అసలే వరల్డ్ కప్.. అందులోనూ ఇండియా–పాకిస్తా న్ మ్యాచ్..ఇంకేముంది! క్రికెట్ ప్రియుల ఆనందానికి హద్దులే ఉండవ్ ! వారిలో మరింత జోష్ నిం పేందుకు నగరంలోని రెస్టా రెంట్లు ఫుడ్ అండ్ బెవరేజెస్ పై భారీ ఆఫర్లతో స్వాగతం పలుకుతున్నాయి. క్రికెట్లవర్స్కోసం ఎల్ఈడీ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశాయి. దీంతీ ఎంచక్కా లైవ్ లో మ్యాచ్ చూస్తూ నచ్చిన ఫుడ్ లాగించేయొచ్చు. తక్కువ ఖర్చుతోనే అపరిమిత స్నాక్స్ఆరగించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ? అపరిమిత ఫుడ్ తింటూ అంతులేని ఆనందం పొందండి.
సిట్రస్ కెఫేలో..
నగరంలోని సిట్రస్ కెఫే మల్టీక్యూజిన్ కెఫె అండ్ బార్ లో డిఫరెంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాజువల్ అట్మాస్ఫియర్ లో కాంటినెంటల్, ఓరియంటల్ క్యూజిన్ లో డిఫరెంట్ డిషెస్ ని అందిస్తున్నారు. వాటిలో భట్టీ ద ముర్గ్ – బార్బిక్యూ స్ప్రింగ్ చికెన్ మారినేటడ్ ఇన్ యోగర్ట్, చిల్లీ, లైమ్ అండ్ కొరియాండర్ డిషెస్ ఉన్నాయి. సిట్రస్ కెఫే కి సంబంధించి బంజారాహిల్స్, హైటెక్ సిటీ, లెమన్ ట్రీ బ్రాంచ్ లలో ఈ క్యూజిన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫుడ్ అండ్ బేవరేజ్స్ పై 30శాతం ఆఫ్ ని అందిస్తున్నారు. ఈ ఆఫర్స్ కూడా కొన్ని బ్యాంక్ కార్డ్ లకు మాత్రమే పరిమితమై ఉన్నాయి.
వాకి-కికి- పోలినేషియన్ రెస్ట్రో బార్ లో
గచ్చిబౌలి రాడిసన్ లో ఉన్న పోలినేషియన్ రెస్ట్రో బార్ లో నిర్వాహకులు ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్ అందుబాటులో ఉంచారు. ఆహ్లాదకర వాతావరణంలో స్క్రీన్ లను ఏర్పాటుచేసి కస్టమర్లకు మంచి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లేమ్డ్ ప్రాన్స్ సన్ ఫ్రాన్సిస్కో, ది పోలినేషియన్ ప్రిన్సెస్ – ఇందులో చికెన్, ష్రింప్స్, వెజ్జీస్ ని కొకనట్ సాస్, సీ ఫుడ్ డిషెస్ తో సర్వ్ చేస్తారు. ఈ రెస్ట్రోబార్ లో సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ కి ఫుడ్ అండ్ బేవరేజ్ లపై 30 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.
అబిడ్స్ బ్రిస్ట్రోలో
ఫేవరెట్ క్రికెట్ల షాట్స్ చూస్తూ, మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ డెలిషియస్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండని ఆహ్వానిస్తోంది అబిడ్స్ లోని ఆబిడ్స్ బ్రిస్ట్రో. ఈ బ్రిస్ట్రో సీటింగ్ సౌకర్యం, ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ డిషెస్ ని అందిస్తున్నారు. వాటిలో ఎక్కువగా పనీర్ టిక్క మాసాలా, కడాయ్ చికెన్ కస్టమర్ల నోరూరిస్తున్నాయి. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పై 30 శాతం ఆఫ్ ని ఫుడ్ అండ్ బేవరేజెస్ లో కల్పిస్తున్నారు. క్రికెట్ లవర్స్ తమ ఫేవరేట్ ఫుడ్ ని తింటూ మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు బిగ్ స్క్రీన్ ని ఏర్పాటుచేస్తున్నారు.
వేరందాహ్ లో..
సోమాజిగూడ ది పార్క్ హోటల్ లో ఉన్న వేరందాహ్ లో క్రికెట్ లవర్స్ కోసం బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. రిఫ్రెషింగ్ కాక్ టెయిల్స్, చెట్టినాడ్ పనీర్ టిక్క, చికెన్ టిక్క ట్రిలోగీ, ముర్గ్ మిర్చ్ టిక్క, ముర్గ్ మలాయ్ టిక్క, ముర్గ్ జఫ్రానీ టిక్క వంటి డిషెస్ అందిస్తున్నారు. వాటిలో సెలెక్టెడ్ కార్డ్స్ పై 30శాతం ఆఫ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ పై అందిస్తున్నారు.
రూ.200కే అన్లిమిటెడ్ స్నాక్స్
క్రికెట్ ప్రేమికుల కోసం బేగంపేట్ లో ఇటీవలే ప్రారంభమైన హే రెస్టారెంట్ అపరిమిత ఆఫర్లతో ఫుడ్ అండ్ బేవరేజ్ మెనూని అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ కస్టమర్లు క్రికెట్ మ్యాచ్‌ను ఆనందించేలా మెనూని ప్రిపేర్ చేశామన్నారు. ఇందులో కార్న్ చాట్, మసాలా ఫ్రెష్ చిల్లీ చికెన్, తందూరీ చికెన్ వంటి స్నాక్స్ ని రూ.రెండొందలకే అపరిమితంగా పొందవచ్చని, డ్రింక్స్ లో ఒకటి కొంటే ఒకటి ఉచితమన్నారు.