8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: కూరగాయలు, పప్పుల వంటి వాటి ధరలు తగ్గడంతో గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది సంవత్సరాల కనిష్ట స్థాయి 1.55 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.1 శాతం, జులై 2024లో 3.6 శాతంగా ఉంది.  2017 జూన్​తరువాత ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అప్పుడు 1.46 శాతంగా నమోదయింది. గత జులైలో ఆహార ద్రవ్యోల్బణం సంవత్సరానికి –1.76 శాతంగా ఉంది.