దేశంలో ఉల్లి మంటలు : ముందుగానే అలర్ట్ అయిన సర్కార్

దేశంలో ఉల్లి మంటలు : ముందుగానే అలర్ట్ అయిన సర్కార్

ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం నుంచి ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారం క్రితం కిలో రూ.30 రూపాయలున్న ఉల్లి ధర.. దాదాపు 57 శాతం పెరిగి ప్రస్తుతం 50కి చేరువైంది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ధరలు  సామాన్యుడికి మరోసారి కన్నీళ్లు పెట్టించనున్నాయి. 

శుక్రవారం (అక్టోబర్ 27) నాటికి  ఉల్లి కిలో ధర 47 రూపాయలకు పెరిగింది.గత వారం క్రితం కిలో ఉల్లి ధర 25 రూపాయలుగా ఉంది. హోల్ సేల్ లో అక్టోబర్ 1న క్వింటా ఉల్లి ధర రూ. 2వేల506 ఉండగా.. అక్టోబర్ 27 నాటికి 2వేల112 రూపాయలకి పెరిగింది.వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. డిసెంబర్ వరకు ఖరీఫ్ పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. అప్పటి వరకు ఉల్లి ధర పెరుగుతూనే ఉంటే అవకాశం ఉంది. 

పండుగ సీజన్ లో ఉల్లికి డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల పాలు ఉల్లి ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరుగుతున్న ఉలి ధరలల ఉల్లి పాయలను వినియోగించే లక్షలాది కుటుంబాలపై అదనపు భారం పడవచ్చు. 

డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ఎగుమతులపై ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలను అరికట్టేందుకు , వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్ విక్రయాలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ధరలు బాగా పెరిగిన రాష్ట్రాల్లో హోల్ సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని సరఫరా చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లలో కిలో ఉల్లిని రూ. 25 లకు అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 

ALSO READ :సినిమాల్లోకి వచ్చేయ్.. వార్నర్‌‌కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్