
ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్ లకు ఫ్యాషన్ అయ్యిందని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి.. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని వ్యాఖ్యానించారు. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆకునూరి మురళీ.
బీఆర్ ఎస్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్దం అంటూ స్మిత ట్వీట్ చేశారు .
2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏస్ విధుల్లో చేరిన స్మితా సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పనీతీరులో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపును పొందారు. తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
అప్పటి ప్రభుత్వం లో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం కు వెళ్లి ( అక్కడి caste కనెక్షన్స్ network వాడుకొని ) ఇక్కడి తప్పులను తప్పించుకోడం fashion అయ్యింది కొంత మంది IAS ఆఫీసర్లకు.
— Murali Akunuri (@Murali_IASretd) December 13, 2023
తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రం కు పంపకుండా చర్యలు తీసుకోవాలి. ఏం తప్పులు… pic.twitter.com/LXHGJtsuLi