
ఖమ్మం టౌన్, వెలుగు : తమ ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు బుధవారం ఖమ్మంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెహ్రు నగర్ లోని పెన్షనర్స్ భవన్ నుంచి జిల్లా పరిషత్ దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు మాట్లాడుతూ తమకు జీవించే హక్కు కావాలని, ఉద్యోగ విరమణ జరిగి 20 నెలలు కావస్తున్నా తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదని, దాంతో ఆర్థిక ఇబ్బందులతో కొందరు బలవన్మరణాల పాలవుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య, ఎం. సుబ్బయ్య, జిల్లా నాయకులు టీ.జనార్ధన్, ఎస్. పూర్ణచంద్రరావు, ఖాజా మొయినుద్దీన్, రాయల వెంకటనారాయణ. యు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, డి.కె.శర్మ రాజారావు, చావగాని బాబు, హనుమంతరావు, గురవయ్య, భాస్కర్ రెడ్డి, బాబురావు, పనిరాజ్ కుమార్, మురళి, వెంకటేశ్వర్లు, శంకర్ పాల్గొన్నారు.