
హైదరాబాద్, వెలుగు: తొమ్మిదేండ్లలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్లో వచ్చిన కమీషన్తోనే దేశంలో రాజకీయ వ్యాపారం చేసేందుకు బీఆర్ఎస్సిద్ధమవుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. విపక్ష కూటమికి చైర్మన్ చేస్తే 2024 ఎన్నికల ఖర్చు భరిస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించినట్లు జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన కామెంట్లపై మంగళవారం ఆయన స్పందించారు.
‘వీ6 డిజిటల్’లో పబ్లిష్ అయిన ఆర్టిక ల్ను ట్వీట్చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘గత 9 ఏండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,42,481 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో వచ్చిన కమీషన్లు కావొచ్చు. ఇసుక, కాంట్రాక్టర్ల మాఫియాలతో పాటు ఇతర మాఫియాల ద్వారా సంపాదించిన భారీ అవినీతి సొమ్ముతో దేశం మొత్తం రాజకీయ వ్యాపారం చేసేందుకు ముఠా సిద్ధమైంది’’ ఆకునూరి మురళి అని పేర్కొన్నారు.