
Coffee Day Enterprises: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్న క్రమంలో కొన్ని షేర్లు మాత్రం మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముఖ కాఫీ రిటైలింగ్ సంస్థ కాఫీడే ఎంటర్ ప్రైజెస్ కంపెనీ షేర్ల గురించే. నేడు కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి బీఎస్ఈలో రూ.39.89 స్థాయికి చేరుకున్నాయి. అయితే నిన్న కూడా కంపెనీ షేర్లలో ఇదే ధోరణి కనిపించింది. వరుసగా కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్లో లాక్ కావటానికి ప్రధాన కారణం ప్రముఖ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా జూన్ త్రైమాసికంలో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినట్లు షేర్ హోల్డర్స్ డేటా ప్రకారం వెల్లడైంది.
ALSO READ : Gold Rate: పతనమైన బంగారం, వెండి రేట్లు.. బుధవారం హైదరాబాద్ రేట్లివే..
డాలీ ఖన్నాకు కంపెనీలో 1.55 శాతం వాటా అంటే 32లక్షల 78వేల షేర్లు ఉన్నట్లు వెల్లడైంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక సమయంలో తన నష్టాలను భారీగా తగ్గించుకుని రూ.144.16 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఏడాది అదే కాలంలో నష్టాలు రూ.296 కోట్లుగా ఉండటం గమనార్హం. 2025 ఆర్థిక సంవత్సరంలో సీసీడీ మెుత్తం వ్యాపార ఆదాయం రూ.వెయ్యి 125 కోట్లుగా నమోదైంది.