రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులుకు పూలే అవార్డ్..

రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులుకు పూలే అవార్డ్..
  • బీసీల సంక్షేమానికి చేస్తున్న కృషికి గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు 'మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు-2026'కు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కోసం చిరంజీవులు చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి  పూలే అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవులుకు అవార్డును అందజేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ మేధావులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని రాజ్ నారాయణ ముదిరాజ్ వివరించారు. 

2002 సివిల్స్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన చిరంజీవులు తన పదవీ కాలంలో గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, మహిళా సాధికారత, విద్య, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి కీలక శాఖల్లో పనిచేశారు.హెచ్ఎండీఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలు అందించారు. కాకతీయ, శాతవాహన వర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. ఆరోగ్య రక్ష, ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ అమలులో కీలక పాత్ర పోషించారు. 

చిరంజీవులు 2019లో తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డును, 2020లో భారత ప్రభుత్వ ఐటీ శాఖ నుంచి ఎమర్జింగ్ టెక్నాలజీస్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.గత రెండేళ్లుగా బీసీ సిద్ధాంతాలపై అనేక పుస్తకాలు రచించడమే కాకుండా, సదస్సులు నిర్వహిస్తూ బీసీ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి విశేషంగా రాజ్ నారాయణ పేర్కొన్నారు.