
- రిటైర్డ్ఐఏఎస్ చిట్ల పార్థసారథి
ఆర్మూర్, వెలుగు: స్టూడెంట్స్ను ఉన్నత స్థాయికి చేర్చేలా విద్యా బోధన జరగాలని, ఆ విధంగా టీచర్స్కృషి చేయాలని చిట్ల ప్రమీల జీవన్రాజ్మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, రిటైర్డ్ఐఏఎస్చిట్ల పార్థసారథి సూచించారు. ఆర్మూర్‌లో మంగళవారం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీచర్లకు మోటివేషన్ క్లాస్, స్టూడెంట్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. బోధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలని టీచర్లకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలన్నారు.
అనంతరం ఆరు మండలాలకు చెందిన 128 మంది టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధనలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎస్సీ ఆర్టీ రిసోర్స్ పర్సన్ల ద్వారా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్మూర్జడ్పీ బాయ్స్, గర్ల్స్హైస్కూల్స్, రామమందిర్ హైస్కూల్, సైదాబాద్ ఉర్ధూ స్కూల్ కు చెందిన 9 మంది స్టూడెంట్స్కు నగదు బహుమతులు, మెడల్స్ అందించి సత్కరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన మాలవియ, డీఈవో అశోక్ కుమార్, ఎంఈవో రాజగంగారాం, తహసీల్దార్సత్యనారాయణ, కమిషనర్ రాజు, ట్రస్ట్ కన్వీనర్నర్సింలు తదితరులు పాల్గొన్నారు.