
- సీఎస్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రెన్యువబుల్ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శరత్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా.. శరత్ గతంలో ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం సీరియస్ అవ్వడమే కాకుండా, అధికారులు ఈ తీరును మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.