
- భౌతికకాయం మెడికల్ కాలేజీకి దానం
మహబూబ్ నగర్ కలెక్టరేట్, అచ్చంపేట, వెలుగు: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో బాల్ జంగయ్య భౌతికకాయాన్ని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆదివారం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అప్పగించారు. బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా విద్యార్థులకు ఉపయోగపడాలనే బాల్ జంగయ్య కోరిక మేరకు భౌతికకాయాన్ని దానం చేశామని వారు చెప్పారు.
గతంలో ఈయన తండ్రి పడాల బాలయ్య పార్థివదేహాన్ని కూడా ఈ కాలేజీకే అప్పగించారు.అంతకుముందు బాల్జంగయ్య మృతదేహానికి నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకటన్న, ఎమ్మెల్యేగువ్వల బాలరాజు, డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ నివాళి లర్పించారు. బాల్ జంగయ్య ఎంతోమంది పేద స్టూడెంట్స్‌కు విద్యా బుద్ధులు చెప్పి ఉన్నత శిఖరాలకు చేర్చారని వారు గుర్తు చేసుకున్నారు. తుదిశ్వాస వరకు కూడా పాలమూరు అధ్యయన వేదిక నాగరకర్నూల్ జిల్లా ప్రెసిడెంట్‌గా సేవలందించారని కొనియాడారు.