వరంగల్ కేఎంసీ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత

వరంగల్ కేఎంసీ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత

గ్రేటర్​వరంగల్, వెలుగు: రిటైర్డ్ లెక్చరర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు వరంగల్ కాకతీయ మెడికల్​కాలేజీకి  డొనేట్ చేసి సామాజిక బాధ్యతను చాటారు. వరంగల్​సిటీకి చెందిన రిటైర్డ్ లెక్చరర్ బోయిన ప్రభాకర్​యాదవ్(76) మంగళవారం చనిపోయారు. ఆయన భార్య ఉమాదేవి, కుమార్తెలు శ్రీలత, వాసవి, అల్లుడు సునీల్​నిర్ణయం మేరకు సమాజహితం కోరి  మెడికల్​కాలేజీకి దానం చేసినట్టు  తెలంగాణ నేత్ర దాతల అసోసియేషన్​ప్రెసిండెంట్​మల్లారెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్​సంధ్య తెలిపారు. దత్తు యాదవ్​, శ్రీనాత్​ బాబు, రామకృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నారు.