ఓటు వేసేందుకు 148 కిలోమీటర్లు సైకిల్పై.. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మనూర్ కు రిటైర్డ్ సోల్జర్

ఓటు వేసేందుకు 148 కిలోమీటర్లు సైకిల్పై.. హైదరాబాద్ నుంచి  సంగారెడ్డి జిల్లా మనూర్ కు రిటైర్డ్ సోల్జర్

సంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ మాజీ సైనికుడు 148 కిలోమీటర్లు సైకిల్​ తొక్కాడు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలకేంద్రంలో బుధవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఓటు వేసేందుకు రిటైర్డ్​ మిలటరీ ఉద్యోగి మల్లయ్య హైదరాబాద్​ లోని లింగంపల్లి బీహెచ్​ఈఎల్​ నుంచి సైకిల్​పై బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున 4:20 గంటలకు బయల్దేరి ఉదయం 10 గంటల వరకు మనూర్ గ్రామానికి చేరుకున్నాడు. ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి అదే సైకిల్​పై హైదరాబాద్​కు వెళ్లిపోయాడు.