
ట్యాంక్ బండ్,వెలుగు: రాష్ట్రంలో చాలామంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమని గెజిటెడ్ హెడ్మాస్టర్ ఆస్పరెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ నజీముద్దీన్ అన్నారు. ఆదివారం ఇందిరాపార్క్ లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో గ్రేడ్ 2 హెడ్మాస్టర్ల పదోన్నతులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల్లో మిగిలిపోయిన విరమణ చేసిన 750 పై చిలుకు పాఠశాలలకు వెంటనే ప్రధానోపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.