
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మాట విని బీజేపీ.. సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని, సంజయ్‌ని మార్చినట్టు రేవంత్‌ను మార్చలేరని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. దాసోజు శ్రవణ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్న భ్రమలోనే ఉన్నట్టున్నారని మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తూ దాసోజు ఏఐసీసీకి లేఖ రాశారన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చిందని గుర్తుచేశారు. తిట్లలో కేసీఆర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అని ఎద్దేవా చేశారు.