- హైదరాబాద్ చేరుకున్న రేవంత్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కేవలం ఒక్క రోజుకే పరిమితమైంది. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తో మర్యాదపూర్వక సమావేశంతో రేవంత్ తన ఢిల్లీ టూర్ ను ముగించారు. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.ఈ టూర్ లో రేవంత్‌ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ కలిశారు.
గెలుపుపై చర్చించారు. రేవంత్ ఢిల్లీ టూర్ లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై క్లారిటీ వస్తుందని ఆశావహులు భావించారు. కానీ కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ను కలువకుండానే రేవంత్ టూర్ ముగియడంతో రాజకీయ పరమైన నిర్ణయాలన్నీ వాయిదా పడ్డాయి. వచ్చే నెల 3న రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున ఆ తర్వాతే పదవుల పంపకం పై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
