మోడీది  నమ్మించి మోసం చేసే తత్వం

మోడీది  నమ్మించి మోసం చేసే తత్వం

మళ్లీ వ్యవసాయ చట్టాలు తెస్తే కేసీఆర్ ఎవరి వైపు నిలబడతారని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మళ్లీ చట్టాలను వెనక్కి తీసుకొస్తామన్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి అలా అన్నాడో లేదో కేటీఆర్ ఇలా రంగంలోకి దిగాడన్నారు. యూపీ, పంజాబ్ లో బీజేపీ తూడిచిపెట్టుకు పోతుందన్న భయమన్నారు. మోడీ ఢిల్లీకి పిలవడంతో కేసీఆర్ లో వణుకు పుట్టిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న  700 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అణా పైసా కూడా ఇవ్వలేదన్నారు. కనీసం వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించలేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు భయపడి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బాతాకాని కొట్టారన్నారు. మోడీది  నమ్మించి మోసం చేసే తత్వమన్నారు. రైతులు ఎంతపండించినా  కొని తీరాల్సిందేనన్నారు రేవంత్.

పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం దురదృష్టమకరమన్నారు రైతుల జీవితాల్లో వెలుగునింపేందుకు MSP విధానం తెచ్చామన్నారు. MSP  తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు. 23 రకాల పంటలకు MSP వర్తిస్తుందన్నారు. 80 కోట్ల మంది రైతుల హక్కులను, శ్రమను కాపాడిందే కాంగ్రెస్  అని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం అయ్యిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను మోడీ ప్రభుత్వం తెచ్చిందిన్నారు. కార్పొరేట్ల చేతిలో రైతులను బంధీలుగా మార్చేందుకు ప్రయత్నించారన్నారు.  వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం రాహుల్ గాంధీ విజయమన్నారు.