ఆరేళ్లలో కేసీఆర్ చేసిన రెండు పనులివే..

ఆరేళ్లలో కేసీఆర్ చేసిన రెండు పనులివే..

ఆరేండ్లలో కేసీఆర్ చేసిన పనుల్లో ఒకటి ప్రగతి భవన్ కట్టుకోవడం, రెండు సెక్రటేరియట్ ను కూల్చివేయడమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి . తెలంగాణ రావడానికి ముందు తరువాత చేసింది ఏమి లేదన్నారు. కేసీఆర్,కేటీఆర్ భ్రమలు కల్పించారు తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదన్నారు. . హైదరాబాద్ కు రింగ్ రోడ్డు, మెట్రో రైలు,ఫ్లై ఓవర్ లు కాంగ్రెస్, టీడీపీ లు కట్టినవేనన్నారు.  అప్పుడు మిగిలిన వాటిని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారన్నారు. అన్ని చేస్తే టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ లో నుండి ఎందుకు డిలీట్ చేశారన్నారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఫ్లై ఓవర్ లు నిర్మించారన్నారు. మెట్రో రైలు కట్టింది 67 కిలోమీటర్లేనన్నారు. గౌలి గూడ ఫలక్ నామ ప్యాలెస్ కు పూర్తిగా నిర్మిస్తేనే ఆ ప్రాజెక్టు72 కి.మీ పూర్తి  అయినట్టన్నారు. భూ సేకరణ జరగలేదని ఆ ప్రాజెక్టు కట్టడం లేదన్నారు.  ఆంధ్ర పాలకులు తెలంగాణ ను నాశనం చేస్తే..తెలంగాణ ను కేసీఆర్ దోపిడీ, విధ్వంసం చేస్తున్నారన్నారు.  హైదరాబాద్ చుట్టూ 4 హాస్పిటల్ లు కడుతామని చెప్పి 4 ఏండ్లు అవుతున్నా ఇప్పటికి ఒక్కటి కూడా కట్టలేదన్నారు.

పీజేఆర్ పోరాటం వల్ల కృష్ణ నది జలాలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు. గోదావరి నది జలాలు కిరణ్ కుమార్ రెడ్డికి తీసుకువస్తే కేటీఆర్ గోదావరి నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాడన్నారు.  అన్ని రంగాల్లో ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైంకు  పాల్పడుతుందన్నరు. రూ. 60 చేస్తుందన్నారు.అదనంగా రూ. 40 వసూలు చేస్తున్నారన్నారు.  మెట్రో, స్యాండ్ ,ల్యండ్,మైన్స్ అన్నీ టీఆర్ఎస్ పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు. పేకాట స్థావరాలను మూసేసి.. ప్రభుత్వ పెద్దలు పేకాటను  ఆన్ లైన్ లో గ్యాంబ్లింగ్  చేస్తున్నారన్నారు.

హైదరాబాద్ ను మహా నగరంగా తీర్చిదిద్దింది నిజాం నవాబులేనన్నారు .  4 వేల చెరువులను గుర్తించ లేక్ సిటీగా గుర్తింపునిచ్చారన్నారు. విద్యా , వైద్యం,ఆరోగ్యం రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. 100 సంవత్సరాల్లో ఎంత ఆక్రమణకు గురైందో,ఈ ఐదేళ్లలో మూసీనది, గండిపేట చెరువు,పార్కులు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. హైదరాబాద్ లో వచ్చిన వరదలు ప్రకృతి వైపరిత్యం కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన వరదలన్నారు. 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడటానికి ప్రభుత్వమే కారణమన్నారు. తప్పుడు ప్రచారాలతో అబద్దపు పుస్తకాలు ప్రచురించి లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది అక్షరాల కేవలం రూ. 6 వేల కోట్లన్నారు. ఇందులో రూ.2400 కోట్లు అప్పుతెచ్చారన్నారు.