కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: భద్రకాళి బండ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గురువారం భద్రకాళి, వడ్డేపల్లి బండ్‌లను సందర్శించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
వడ్డేపల్లి బండ్ పనులను ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు. భద్రకాళి బండ్‌పై గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు బల్దియా హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ జోనా వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలన్నారు.
