హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాల వేళ ఎదైనా సమస్య తలెత్తితే హైడ్రా టోల్‌ఫ్రీ 1070 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని హైడ్రా సూచించింది. అదనంగా కంట్రోల్ రూమ్ నంబర్లు 9000113667, 8712406901, 7337218171లను కూడా అందుబాటులో ఉంటాయని, కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమస్యని తెలియ జేయవచ్చని సూచించింది. దీనికి సంబంధించి మాన్సూన్ రెస్పాన్స్ పేరుతో రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను గురువారం హైడ్రా విడుదల చేసింది.
నీరు నిల్వడం, చెట్లు కూలడం, డ్రైనేజీ పొంగిపొర్లడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోస్టర్‌లో వివరించింది. అలాగే, హైడ్రా తాజా సమాచారం కోసం తమ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ను ఫాలో కావచ్చని సూచించింది.
