కేసీఆర్ ను సీఎం చేస్తే..కుటుంబ పాలన చేస్తుండు

కేసీఆర్ ను సీఎం చేస్తే..కుటుంబ పాలన చేస్తుండు

కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్ ను సీఎం చేస్తే.. ఏమి చెయ్యకుండా కుటుంబ పాలన చేస్తున్నాడంటూ ఆరోపించారు. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టడంతో పాటు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు టెండర్లు  ఇచ్చాడంటూ విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, గిరిజనులకు పోడు భూములు ఏం ఇవ్వలేదని ఆరోపించారు. 


ఫీజు రీఎంబర్స్ మెంట్స్, ఆరోగ్య శ్రీ లేనే లేదన్నారు రేవంత్ రెడ్డి. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు రాకపోయే అని అన్నారు. దళితులకు 3ఎకరాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ రాలేదన్నారు. అంతేకాదు.. మహిళకు పావలా వడ్డీ రుణాలు ,బడిపిల్లలకు పగటిలి బువ్వ బంద్ అయ్యిందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు తలొక్క ఫామ్ హౌస్ వచ్చిందని తెలిపారు. 


కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావులకు పదవులొచ్చాయ్..చూయించుకోడానికి టీవీ, పేపర్ వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న కుటుంబాలను ఏమి రాలేదన్నారు. కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కళ సాకారం కావాలంటే.. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.